అభిషేక్ శర్మ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా..
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:08 PM
ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఎస్ఆర్‌హెచ్ పవర్ హిట్టర్, అభిమానుల ‘పులి’ అభిషేక్ శర్మ వీర విధ్వంసం చేశాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీల్లో అభిషేక్ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఎస్ఆర్‌హెచ్ పవర్ హిట్టర్, అభిమానుల ‘పులి’ అభిషేక్ శర్మ వీర విధ్వంసం చేశాడు. పంజాబ్ బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుపడి కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. తన బ్యాటింగ్ పార్ట్‌నర్ ట్రావిస్ హెడ్(38)తో కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డును నమోదు చేశాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఐదో ఓవర్లో విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన నాలుగో బంతికి భారీ సిక్సర్ బాది అభిషేక్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ టోర్నీలో 20 కన్నా తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించాడు. గత ఐపీఎల్ సీజన్లలో అభిషేక్ ఇప్పటికే నాలుగుసార్లు వేగవంతమైన హాఫ్ సెంచరీలు బాదాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితా ఇదే..
2026: పంజాబ్ కింగ్స్‌పై 18 బంతుల్లో
2025: లఖ్‌నవూపై 18 బంతుల్లో
2024: ముంబై ఇండియన్స్‌పై 16 బంతుల్లో
2024: లఖ్‌నవూపై 19 బంతుల్లో
2024: పంజాబ్‌పై 19 బంతుల్లో
అభిషేక్ తర్వాత..
ఈ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత నికోలస్ పూరన్ నిలిచాడు. ఐపీఎల్‌లో నాలుగుసార్లు 20 కంటే తక్కువ బంతుల్లో పూరన్ హాఫ్ సెంచరీలు సాధించాడు. జేక్ ఫ్రేజర్, ట్రావిస్ హెడ్, వైభవ్ సూర్యవంశీ మూడుసార్లు 20 బంతుల్లోపే హాఫ్ సెంచరీ చేశారు. ఇక ఐపీఎల్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధ శతకం రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేరు మీద ఉంది. 2023లో అతడు కోల్‌కతాపై కేవలం 13 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220
బాల్ టాంపరింగ్‌ను చట్టబద్ధం చేయాలి.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు