Share News

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:28 PM

న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఐపీఎల్ 2026: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 220
SRH vs Punjab Kings

ఇంటర్నెట్ డెస్క్: న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పుర్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ కింగ్స్‌కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ల ధాటికి స్కోర్ బోర్డు పట్టాపగ్గాల్లేకుండా పరుగులు పెట్టింది. అభిషేక్ శర్మ(74; 28 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఎట్టకేలకు ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.


మరోవైపు ట్రావిడ్ హెడ్(38; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తొలి వికెట్‌కు అభిషేక్, హెడ్ కలిసి 49 బంతుల్లో ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ల ధాటికి పంజాబ్ కింగ్స్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఇషాన్ కిషన్(27), హెన్రిచ్ క్లాసెన్(39), అనికేత్ వర్మ(18), సలీల్ అరోరా(9) రాణించారు. నితీశ్ కుమార్ రెడ్డి(0*), హర్ష్ దూబె(1*) నాటౌట్‌గా నిలిచారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 2, శశాంక్ సింగ్ 2, బార్ట్‌లెట్ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్ శెట్టి

మిస్టరీ స్పిన్నర్ తారిక్ బౌలింగ్‌లో ఆడటానికి ఇష్టపడని డారిల్ మిచెల్.. వీడియో వైరల్

Updated Date - Apr 11 , 2026 | 05:28 PM