Share News

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్ శెట్టి

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:00 PM

భారత బ్యాడ్మింటన్‌లో చారిత్రాత్మక విజయం నమోదైంది. చైనాలోని నింగ్బో వేదికగా జరుగుతోన్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు.

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆయుష్ శెట్టి
Ayush Shetty

ఇంటర్నెట్ డెస్క్: భారత బ్యాడ్మింటన్‌లో చారిత్రాత్మక విజయం నమోదైంది. చైనాలోని నింగ్బో వేదికగా జరుగుతోన్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుశ్ శెట్టి సంచలనం సృష్టించాడు. సెమీస్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ కున్లావుత్ వితిద్సర్స్(థాయ్‌లాండ్)ను ఓడించి ఆయుశ్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తొలి సెట్‌ను 10-21తో కోల్పోయినప్పటికీ పట్టువదలకుండా పోరాడి గెలిచాడు. హోరాహోరీగా సాగిన పోరులో 10-21, 21-19, 21-17 తేడాతో ఆయుశ్ విజేతగా నిలిచాడు.


అరుదైన ఘనత

కేవలం మూడు సెట్లు మాత్రమే ఉండే సెమీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఓడాడు ఆయుష్. అయినప్పటికీ తిరిగి పుంజుకుని అద్భుతం చేశాడు. వరుసగా రెండు సెట్లలో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆయుశ్ షెట్టి ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఆసియా ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత షట్లర్‌గా నిలిచాడు. 1965లో దినేశ్ ఖన్నా తొలిసారి భారత్ తరఫున ఫైనల్‌కు చేరారు. ఒకవేళ ఫైనల్‌లోనూ గెలిచి స్వర్ణం సాధిస్తే ఆయుష్.. తొలి భారత షట్లర్‌గా రికార్డు సృష్టిస్తాడు.


ఇవి కూడా చదవండి:

వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్

నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం

Updated Date - Apr 11 , 2026 | 03:00 PM