15 ఏళ్ల కుర్రాడు అలా ఆడడం అద్భుతమే: భువనేశ్వర్ కుమార్
ABN , Publish Date - Apr 11 , 2026 | 12:47 PM
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెరుపు వేగంతో 78 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు.
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మెరుపు వేగంతో 78 పరుగులు చేసి మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అతని బ్యాటింగ్ స్టైల్, షాట్ సెలెక్షన్ అందరినీ ఆశ్చర్యపరిచింది (Bhuvneshwar Kumar on Sooryavanshi).
వైభవ్ ఇన్నింగ్స్‌పై ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ప్రశంసలు కురిపించాడు. పదిహేనేళ్ల కుర్రాడు అలా ఆడడం అద్భుతమని కొనియాడాడు. 'మా ఓటమికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీ దూకుడే. పదిహేనేళ్ల కుర్రాడు అద్భుతంగా ఆడాడు. ఈ విధంగా బ్యాటింగ్ చేయడం సాధారణ విషయం కాదు. ఇక్కడ ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. మ్యాచ్‌లో గెలిచేందుకు చాలా ప్రణాళికలు వేసుకున్నాం. కొన్ని క్యాచ్‌లు జారవిడిచాం. టీ-20 మ్యాచ్‌లో కొన్నిసార్లు ఇలా జరుగుతుంటాయి' అని భువీ అన్నాడు (Vaibhav Sooryavanshi 78 runs).
'విజయం కోసం మేమేం చేయగలమో అంతా చేశాం. బయటి నుంచి చూస్తే ఒకలా ఉంటుంది (RR vs RCB IPL 2026). మైదానంలోకి దిగితే మరోలా ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్‌లో వైభవ్ మంచి షాట్లు కొట్టాడు. మాకు ఒకే ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పవర్ ప్లేలో అతడితో బౌలింగ్ వేయించాలనుకోలేదు. సుయాశ్ రూపంలో ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మాకు ఆఫ్ స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది' అని భువీ అభిప్రాయపడ్డాడు.
ఇవి కూడా చదవండి..
నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..
స్టార్ బౌలర్లనూ వదలడం లేదు.. వైభవ్ కొట్టిన ఈ సిక్స్‌లు చూస్తే..