Share News

స్టార్ బౌలర్లనూ వదలడం లేదు.. వైభవ్ కొట్టిన ఈ సిక్స్‌లు చూస్తే..

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:30 AM

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో దూకుడుగా ఆడడం అంత సులభం కాదు. మహామహులే బుమ్రా బౌలింగ్‌ను ఆచితూచి ఆడతారు. ఇక, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ జాష్ హేజల్‌వుడ్ కూడా తక్కువ వాడేం కాదు.

స్టార్ బౌలర్లనూ వదలడం లేదు.. వైభవ్ కొట్టిన ఈ సిక్స్‌లు చూస్తే..
Vaibhav Sooryavanshi batting

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో దూకుడుగా ఆడడం అంత సులభం కాదు. మహామహులే బుమ్రా బౌలింగ్‌ను ఆచితూచి ఆడతారు. ఇక, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ జాష్ హేజల్‌వుడ్ కూడా తక్కువ వాడేం కాదు. అలాంటి స్టార్ బౌలర్లను కూడా ఊచకోత కోస్తూ చుక్కలు చూపిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ. మొన్న బుమ్రా బౌలింగ్‌లో, నిన్న హేజల్‌వుడ్ బౌలింగ్‌లో వైభవ్ కొట్టిన సిక్స్‌లు క్రికెట్ నిపుణులనే ఆశ్చర్యపరుస్తున్నాయి (Vaibhav Sooryavanshi batting).


ఆర్సీబీ‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 15 బంతుల్లోనే ఆర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. హేజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. 202 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని సునాయాసంగా మార్చేశాడు. వైభవ్ చేసిన 78 పరుగుల్లో 72 రన్స్ ఫోర్లు, సిక్స్‌ల ద్వారానే వచ్చాయంటే అతడి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు (IPL rising star).


వైభవ్ దూకుడుకు స్టార్ బౌలర్లు కూడా కళ్లెం వేయలేకపోతున్నారు (IPL 2026). బుమ్రా, హేజల్‌వుడ్ వంటి స్టార్ బౌలర్లు తనకెవరో తెలియదన్నట్టుగానే ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కూడా వైభవ్ ఇలాగే చెలరేగాడు. బుమ్రా బౌలింగ్‌లో అతడు కొట్టిన సిక్స్‌లు చూసి తోటి బ్యాటర్లు ఆశ్చర్యపోయారు. మొత్తానికి వైభవ్ జోరు కారణంగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అప్రతిహతంగా దూసుకెళ్తోంది.


ఇవి కూడా చదవండి..

నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..


పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 11 , 2026 | 09:31 AM