Share News

నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..

ABN , Publish Date - Apr 11 , 2026 | 07:50 AM

పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. ఆసియా దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక, ఇరాన్‌పై దాడికి తెగబడిన అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది.

నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..
US Iran war cost per minute

పశ్చిమాసియాలో జరిగిన యుద్ధం ప్రపంచ దేశాలకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించింది. ఆసియా దేశాలు చమురు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇక, ఇరాన్‌పై దాడికి తెగబడిన అమెరికా కూడా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ యుద్ధం కోసం అమెరికా భారీగా ఖర్చు పెట్టింది. ఆమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధం భారీ భారాన్ని మోపింది. ఇజ్రాయెల్‌కు అండగా యుద్ధంలోకి దిగిన అమెరికా ఒక్కో సెకెనుకు రూ.9.8 లక్షల రూపాయల చొప్పున ఖర్చు పెట్టింది (US Iran war cost per minute).


స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. ఇరాన్ యుద్ధంలో అమెరికా నిమిషానికి రూ.5.8 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ యుద్ధం కోసం అమెరికా 30 నుంచి 35 బిలియన్ డాలర్ల మేర ఖర్చు పెట్టింది. అంటే భారత కరెన్సీలో 2.5 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు. ఇది ప్రపంచంలోని చాలా దేశాల వార్షిక బడ్జెట్‌ కంటే ఎన్నో రెట్లు అధికం. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, యుద్ధ విమానాలు, డ్రోన్లు, బాంబులు, క్షిపణులు, నౌకాదళ ఆపరేషన్లు, సైనిక లాజిస్టిక్స్ కోసం అమెరికా వేల కోట్లు ఖర్చు పెట్టింది (US military spending Iran).


ఇంత భారీ ఖర్చు కారణంగా స్వదేశంలో డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది (Iran war expenses US). న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ తాజాగా ట్రంప్ విధాలను విమర్శించారు. 'వేలాది మంది సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొన్న యుద్ధం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రజలను చంపడానికి మనం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. ఆ డబ్బుతో శ్రామిక ప్రజల జీవితాలను సులభతరం చేయవచ్చు. మానవత్వాన్ని హరించే ధోరణి వ్యాప్తి చెందడానికి మనం అనుమతిస్తున్నాం' అని ఆయన విమర్శించారు.


ఈ వార్తలూ చదవండి:

కెనడాలో వైద్యుడు దొరక్క నరకం.. భారత్‌కు వచ్చేసిన ఎన్నారై

ఆసుపత్రిలో దారుణాలను బయటపెట్టిన వైద్యురాలు.. వీడియో వైరల్

Updated Date - Apr 11 , 2026 | 07:50 AM