Share News

మిస్టరీ స్పిన్నర్ తారిక్ బౌలింగ్‌లో ఆడటానికి ఇష్టపడని డారిల్ మిచెల్.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 11 , 2026 | 02:36 PM

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో వింత ఘటన చోటు చేసుకుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది.

మిస్టరీ స్పిన్నర్ తారిక్ బౌలింగ్‌లో ఆడటానికి ఇష్టపడని డారిల్ మిచెల్.. వీడియో వైరల్
Daryl Mitchell

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో వింత ఘటన చోటు చేసుకుంది. క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ స్టార్ బౌలర్, క్వెట్టాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై చాలాకాలంగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా అదే అంశం తిరిగి తెర మీదకు వచ్చింది. తారిక్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఆడటానికి ఇష్టపడలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఇంతకీ అక్కడ ఏమైందంటే..


క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో తారిక్ బౌలింగ్ వేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో క్రీజులో డారిల్ మిచెల్ ఉన్నాడు. బౌలింగ్ ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పటికీ మిచెల్ పలుమార్లు క్రీజును వదిలి వెళ్లడం గమనార్హం. తారిక్ బౌలింగ్ చేసే ప్రతిసారి మిచెల్ వెనక్కి తగ్గి ఆపడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరిస్థితితో మైదానంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ప్రతిసారి ఇలా బౌలింగ్ ఆపడంతో తారిక్, మిచెల్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అంపైర్లు కలగజేసుకుని ప్లేయర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తారిక్ బౌలింగ్‌ యాక్షన్‌పై వివాదం కొనసాగుతోన్న వేళ మిచెల్ ఇలా ప్రవర్తించడం మరింత చర్చకు దారితీసింది.


మ్యాచ్ విషయానికొస్తే..

వివాదాల నడుమ జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగుల స్కోర్ చేసింది. కెప్టెన్ రిలీ రోసో(53) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సౌద్ షకీల్(42), హసన్ నవాజ్(39) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరిలో జహందాద్ ఖాన్(21) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు భారీ స్కోర్ దిశగా సాగింది. రావల్పిండి బౌలర్లలో బెన్ సియర్స్ మూడు వికెట్లతో రాణించాడు. ఛేదనలో రావల్పిండి జట్టు 121 పరుగులకే ఆలౌట్ అయింది.


ఇవి కూడా చదవండి:

వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్

నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం

Updated Date - Apr 11 , 2026 | 02:39 PM