Share News

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఎంట్రీ

ABN , Publish Date - Apr 10 , 2026 | 08:14 PM

గువాహటి వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఎంట్రీ
RR vs RCB

ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. వర్షం కారణంగా టాస్ కాస్త ఆలస్యమైంది. 7 గంటలకు పడాల్సిన టాస్.. 8 గంటలకు పడింది. కాగా మ్యాచ్ 8.15 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడని ఇరు జట్లు తలపడుతుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా, గాయం కారణంగా ఆటకు దూరమైన ఆర్సీబీ స్టార్ ప్లేయర్ హేజిల్‌వుడ్ ఈ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నాడు.


ఆర్సీబీ తుది జట్టు

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పాటీదార్(కెప్టెన్), జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, హేజిల్‌వుడ్

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: సుయాశ్ శర్మ, జాకబ్ బెథెల్, రషిక్ సాలమ్ దార్, కనిష్క్ చౌహాన్, వెంకటేశ్ అయ్యర్

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు

యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రోన్ హిట్‌మేయర్, డొనొవాన్ ఫెర్రీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేశ్ శర్మ

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్స్: వైభవ్ సూర్యవంశీ, ప్రిటోరియస్, రవి సింగ్, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే


ఇవి కూడా చదవండి:

వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్

నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం

Updated Date - Apr 10 , 2026 | 08:17 PM