కెప్టెన్ బాధ్యత తీసుకోకపోతే జట్టు గెలవడం కష్టం.. పంత్‌పై భారత మాజీ ప్లేయర్ విమర్శలు
ABN , Publish Date - Apr 10 , 2026 | 07:42 PM
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే జట్టు గెలిచినప్పటికీ ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఎల్ఎస్‌జీ యువ ప్లేయర్ ముకుల్ చౌదరి సంచలన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఔరా అనిపించాడు. అయితే జట్టు గెలిచినప్పటికీ ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పంత్ 50 బంతుల్లో 68 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేకేఆర్‌పై 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పంత్ బ్యాటింగ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ ఘాటుగా స్పందించాడు.
‘కోల్‌కతాపై జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లఖ్‌నవూ 3 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే పంత్ ఎక్కువ క్రీజులో నిలబడలేకపోవడం తీవ్ర నిరాశ కలిగించింది. జట్టుకు అవసరమైనప్పుడు వికెట్‌ను సులభంగా వదిలేయడం సరైంది కాదు. ఒక కెప్టెన్‌గా బాధ్యత తీసుకోకపోతే జట్టు గెలవడం కష్టం. పరిస్థితి అర్థం చేసుకుని చివరి వరకూ ఆడాలి. పంత్ చేయాల్సింది అదే. ఒక మ్యాచ్‌లో బాగా ఆడి తర్వాతి మ్యాచుల్లో విఫలం అయితే ఏం లాభం? కెప్టెన్‌గానే కాకుండా ఓ ప్లేయర్‌గా స్థిరత్వం అవసరం’ అని కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
వాంఖడే స్టేడియంలో భారత దిగ్గజం రవిశాస్త్రి స్టాండ్
నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నానని తిట్టారు.. ముకుల్ తండ్రి భావోద్వేగం