Share News

వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా.. విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:58 PM

గౌహతీలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాట్ ఝులిపించాడు. 15 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేశాడు.

వైభవ్ సూర్యవంశీ ఆటకు ఫిదా.. విరాట్ కోహ్లీ సర్‌ప్రైజ్ గిఫ్ట్!
Virat Kohli gift Sooryavanshi

గౌహతీలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఏ మాత్రం బెరుకు లేకుండా బ్యాట్ ఝులిపించాడు. 15 బంతుల్లోనే హఫ్ సెంచరీ చేశాడు. 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. వైభవ్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి జట్టు ఆటగాడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఫిదా అయ్యాడు (Virat Kohli gift Sooryavanshi).


మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీని విరాట్ కోహ్లీ అభినందించాడు. వైభవ్ ప్రతిభను ప్రశంసిస్తూ ఓ ప్రత్యేకమైన కానుక అందించాడు. వైభవ్ సూర్యవంశీ ధరించిన క్యాప్‌పై విరాట్ కోహ్లీ తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అలాగే 'వెల్ డన్ వైభవ్' అని కూడా రాశాడు. ఓ యువ ప్రతిభను కోహ్లీ గౌరవించిన తీరు క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. ఈ ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ మరిన్ని రికార్డులను సమం చేశాడు. పవర్‌ప్లేలోనే మూడుసార్లు అర్థ సెంచరీలు చేసిన ఆటగాడిగా జోస్ బట్లర్ సరసన చేరాడు (Kohli surprise gift).


ఈ పవర్‌ఫుల్ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు (Vaibhav Sooryavanshi IPL 2026). అలాగే ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ కూడా దక్కించుకున్నాడు. ఇక, ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో 15 బంతుల్లో రెండు సార్లు అర్థ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా వైభవ్ నిలిచాడు. తాజా సీజన్‌లోనే సీఎస్కేపై కూడా వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం విశేషం.


ఇవి కూడా చదవండి..

నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..

స్టార్ బౌలర్లనూ వదలడం లేదు.. వైభవ్ కొట్టిన ఈ సిక్స్‌లు చూస్తే..

Updated Date - Apr 11 , 2026 | 01:58 PM