Share News

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణాఫ్రికా బ్యాటర్

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:26 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోనే పోటీతత్వం ఎక్కువగా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ రిలే రొస్సో అభిప్రాయపడ్డాడు. రొస్సో ప్రస్తుతం పీఎస్ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు.

ఐపీఎల్ కంటే పీఎస్‌ఎల్‌లోనే నాణ్యమైన క్రికెట్ ఉంటుంది: దక్షిణాఫ్రికా బ్యాటర్
Rilee Rossouw IPL vs PSL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లోనే పోటీతత్వం ఎక్కువగా ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ రిలే రొస్సో అభిప్రాయపడ్డాడు. రొస్సో ప్రస్తుతం పీఎస్ఎల్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, లాభదాయకమైన క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్ ఒక సినిమాలా అనిపిస్తుందని రొస్సో అన్నాడు (Rilee Rossouw IPL vs PSL).


ఐపీఎల్ ఒక సుదీర్ఘ టోర్నమెంట్ అని, దానికి బాలీవుడ్ మద్దతు ఎక్కువగా ఉందని, అది క్రికెట్ టోర్నీలా కాకుండా సినిమాలా ఉంటుందని రొస్సో వ్యాఖ్యానించాడు. 'పీఎస్‌ఎల్‌ లీగ్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. బౌలింగ్, బ్యాటింగ్ క్వాలిటీ పీఎస్‌ఎల్‌లోనే ఎక్కువ. ఇక్కడ మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉంటాయి. ఐపీఎల్‌లో క్రికెట్ కంటే ఎంటర్‌టైన్‌‌మెంట్ ఎక్కువ' అని రోస్సో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు (IPL movie comment).


రిలే రొస్సో గతంలో ఐపీఎల్‌లో ఆడాడు (PSL more fierce Rossouw). 2014 నుంచి 2024 వరకు ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ తరఫున 22 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇటీవలి వేలంలో రొస్సోపై ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై దృష్టి సారించాడు. క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. కాగా, తాజాగా రిస్సో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పాక్, భారత్ క్రికెట్ అభిమానుల మధ్య వాదనలు జరుగుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

నిమిషానికి రూ.5.8 కోట్లు.. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఖర్చు ఎంతంటే..

స్టార్ బౌలర్లనూ వదలడం లేదు.. వైభవ్ కొట్టిన ఈ సిక్స్‌లు చూస్తే..

Updated Date - Apr 11 , 2026 | 12:34 PM