Share News

భూములకు ఉద్యోగాల కేసు.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన లాలూ

ABN , Publish Date - Apr 11 , 2026 | 08:29 PM

భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో శనివారంనాడు పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఎన్.కోటేశ్వర్‌తో కూడిన ధర్మాననం దీనిపై ఈనెల 13న విచారణ జరుపుతుంది.

భూములకు ఉద్యోగాల కేసు.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన లాలూ
Lalu Prasad Yadav

న్యూఢిల్లీ: భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) సుప్రీంకోర్టు (Supreme Court)లో శనివారంనాడు పిటిషన్ వేశారు. న్యాయమూర్తులు ఎంఎం సుందరేశ్, ఎన్.కోటేశ్వర్‌తో కూడిన ధర్మాననం దీనిపై ఈనెల 13న విచారణ జరుపుతుంది.


ఈకేసులో ఇంతకుముందు లాలూ ప్రసాద్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తలిగింది. సీబీఐ తమపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ లాలూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని కోర్టు పేర్కొంది. దీంతో యథాప్రకారం కేసులో విచారణ కొనసాగాల్సి ఉంది. దీంతో లాలూ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగాల కేటాయింపులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రైల్వేలోని వివిధ జోన్లలో అనేక మందిని గ్రూప్-డి పోస్టుల్లో నియమించారు. దీనికి బదులుగా వారి భూములను లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యులతో పాటు ఒక ప్రైవేటు కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ ఆరోపణగా ఉంది. 2022 మే 18న లాలూ, ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు, గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులపై కేసు నమోదైంది. 77 ఏళ్ల లాలూ, ఇతర నిందితులు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. కాగా, సీబీఐ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఇన్వెస్టిగేషన్, చార్జిషీట్లలో చట్టపరమైన లోపాలున్నాయని లాలూ వాదనగా ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 17ఏ కింద సీబీఐ ముందస్తు అనుమతి తీసుకోలేదని, ఇందువల్ల సీబీఐ ప్రొసీడింగ్స్‌ చెల్లనేరవని చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

పాలన అనేది సినిమా కాదు, రీటేక్స్ ఉండవు: విజయ్‌ ఎంట్రీపై చిదంబరం

జననాయగన్ లీక్‌ను బీజేపీతో ముడిపెట్టొద్దు: అన్నామలై

Updated Date - Apr 11 , 2026 | 08:33 PM