Share News

ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం

ABN , Publish Date - Apr 11 , 2026 | 06:17 PM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
Hyderabad Accident

హైదరాబాద్, ఏప్రిల్ 11: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) సమీపంలోని హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోవడంతో, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.


మృతులు పాతబస్తీకి చెందిన అబ్దుల్ సోహెద్ (20) షేక్ సాహిల్ (17)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నట్లు సమాచారం. పని నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 06:17 PM