Share News

యాదగిరి నృసింహుడి దివ్యసన్నిధిలో వేద స్వస్తి

ABN , Publish Date - Nov 02 , 2026 | 05:54 AM

లోకకల్యాణం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ‘వేదస్వస్తి’ మహోత్సవం ఘనం గా జరిగింది.

యాదగిరి నృసింహుడి దివ్యసన్నిధిలో వేద స్వస్తి
Yadadri Temple

  • వందలాది మంది వేద విద్యార్థులు, పండితుల మంత్ర ఘోష

యాదాద్రి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): లోకకల్యాణం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ‘వేదస్వస్తి’ మహోత్సవం ఘనం గా జరిగింది. గర్భాలయ ముఖమండపంలో 550 మంది వేద విద్యార్థులు, గురువులు, వేదపండితుల ఏకకాల చతుర్వేద మంత్రపఠనాలతో ఆలయ ప్రాంగణమంతా వేదనాదంతో మార్మోగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన వేలాదిమంది భక్తులు వేదఘోషను ఆలకిస్తూ, ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు. మరోవైపు లక్ష్మీనృసింహులను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. 42వేల మందికిపైగా భక్తులు తరలిరాగా, దర్శనానికి దాదాపు 3గంటల సమయం పట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు చెక్‌

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 05:54 AM