ప్రభుత్వ విప్ వీరేశానికి తప్పిన ముప్పు
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:07 AM
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఒకేరోజు రెండు ప్రమాదాల నుంచి ముప్పు తప్పింది.
నాలుగు గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రమాదం
కట్టంగూరు/భువనగిరిరూరల్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి ఒకేరోజు రెండు ప్రమాదాల నుంచి ముప్పు తప్పింది. గురువారం ఆయన ప్రయాణిస్తున్న వాహనాలు నల్లగొండ, భువనగిరి జిల్లాల్లో ప్రమాదానికి గురి కాగా, వీరేశం సురక్షితంగా బయటపడ్డారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నాయనమ్మ మృతిచెందటంతో.. వేముల వీరేశం హాజరై ఆమెకు నివాళులర్పించారు.
అక్కడి నుంచి చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వస్తుండగా.. కట్టంగూరు మండలం అయిటిపాములలోని చెర్వుఅన్నారం వద్ద వీరేశం ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుకనుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఆయనతోపాటు ప్రయాణిస్తున్న అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో కారులో జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి ఆయన బయలుదేరారు. నాగిరెడ్డిపల్లి వద్ద వీరేశం ప్రయాణిస్తున్న కారును గుర్తుతెలియని లారీ పక్క నుంచి రాసుకుంటూ వెళ్లటంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కొడంగల్‌లో రేపటి నుంచి సీఎం పర్యటన
Read Latest AP News And Telangana News And National News
And Telugu News