నాగార్జునసాగర్ అధికారులపై చర్యలు తప్పవు!
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:01 AM
ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదానికి కారణమైన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులపై సకాలంలో సమాచారం ఇవ్వని నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులకు సంబంధించి సమాచార లోపంపై ప్రభుత్వం అసంతృప్తి
నేడో, రేపో చర్యలు తీసుకోనున్నారని చర్చ
నల్లగొండ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదానికి కారణమైన పల్నాడు వాటర్ గ్రిడ్ పనులపై సకాలంలో సమాచారం ఇవ్వని నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులపై చర్యలు తీసుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. నాగార్జునసాగర్ కుడివైపున ఏపీ భూభాగం నుంచి పల్నాడు జిల్లాకు తాగునీటి సరఫరాకు ఏపీ గ్రామీణ నీటిసరఫరా శాఖ చేపట్టిన వాటర్‌గ్రిడ్ పనులు తొమ్మిది నెలలుగా కొనసాగుతున్నా.. ప్రభుత్వానికి, ఇరిగేషన్ ఉన్నతాధికారులకు సకాలంలో సమాచారం ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఇందుకు సంబంధించి నాగార్జునసాగర్ ఎస్‌ఈ మల్లికార్జునరావు, ఈఈ గోపీనాథ్, డీఈ రామనాథ్, మరో ఏఈ ఈ నెల 21న హైదరాబాద్‌లోని ఈఎన్‌సీ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారు. పల్నాడు వాటర్‌గ్రిడ్ పనులు విషయం తెలియజేయలేకపోవడానికి కారణాలు వివరించారు. తాము తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ప్రాజెక్టు నిర్వహణ వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తున్నామని, 2023లో జరిగిన గొడవ తర్వాత ఏపీ వైపున్న కంట్రోల్ రూమ్ నిర్వహణ ఏపీ ఇరిగేషన్ పరిధిలోకి వెళ్లినందున తాము ఏపీ భూభాగం వైపు వెళ్లే అవకాశం లేకపోయిందని వారు ఉన్నతాధికారులకు చెప్పినట్టు తెలిసింది. అయితే, ఈ వివరణపై అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వం సదరు అధికారులపై నేడో, రేపో శాఖాపరమైన చర్యలు తీసుకోనుందని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్ గ్రిడ్‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News