బిడ్డ ఊయల చీరే ఉరితాడుగా..
ABN , Publish Date - Nov 20 , 2026 | 06:00 AM
ఊయలూగే వయసు బిడ్డ బోసినవ్వులు, కేరింతలను చూస్తూ ఆ తల్లికి సమయమే తెలిసేది కాదు! అయితే నిండా రెండేళ్లు కూడా లేని తన గారాలపట్టిని విధి తన నుంచి శాశ్వతంగా దూరం చేయడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది!
18 నెలల కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
3 నెలల క్రితం ఆడుకుంటూ నాఫ్తలిన్ బాల్స్ మింగి చిన్నారి మృతి
చౌటుప్పల్ రూరల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఊయలూగే వయసు బిడ్డ బోసినవ్వులు, కేరింతలను చూస్తూ ఆ తల్లికి సమయమే తెలిసేది కాదు! అయితే నిండా రెండేళ్లు కూడా లేని తన గారాలపట్టిని విధి తన నుంచి శాశ్వతంగా దూరం చేయడాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోయింది! అప్పటినుంచి తన బిడ్డ ఊగిన చీర ఊయలనే చూస్తూ నిర్వేదంగా కాలం వెళ్లదీస్తున్న ఆమె ఆ వస్త్రంతోనే ఉరివేసుకొని ప్రాణాలు తీసుకొంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఈ ఘటన జరిగింది.
సీఐ సతీశ్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన మొదల రవి చౌటుప్పల్‌లోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. భార్య పావని (22), కుమార్తె, కుమారుడు హేమంత్ (18నెలలు)తో కలిసి చౌటుప్పల్‌లోని హనుమాన్‌నగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. మూడు నెలల కిత్రం హేమంత్ ఇంట్లో అడుకుంటూ నాఫ్తలిన్ బాల్స్ మింగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన హేమంత్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 15రోజులకు మృతిచెందాడు. కొడుకు మృతితో పావని డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కుమారుడి కోసం ఇంట్లో చీరతో కట్టిన ఊయలనే రోజూ చూస్తూ ఉండేది. గురువారం ఉదయం భర్త మార్కెట్‌కు వెళ్లిన సమయంలో పావని ఆ ఊయల చీరతోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News