Share News

2047లోపు దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ: సీఎం రేవంత్

ABN , Publish Date - Nov 14 , 2026 | 08:27 PM

వైద్య రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌ సైన్సెస్‌ క్యాంపస్‌ నిర్మాణానికి శనివారం హైదరాబాద్‌లోని తాజ్ క‌ృష్ణలో ఆయన శంకుస్థాపన చేశారు.

2047లోపు దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ: సీఎం రేవంత్

ఇంటర్నెట్ డెస్క్: వైద్య రంగంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌ సైన్సెస్‌ క్యాంపస్‌ నిర్మాణానికి శనివారం హైదరాబాద్‌లోని తాజ్ క‌ృష్ణలో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ సైన్సెస్ క్యాంపస్ మాస్టర్ ప్లాన్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే మరిన్ని హాస్పిటల్స్‌ రాబోతున్నాయని చెప్పారు. ఆహార కొరత లేదు..కానీ తినే ఫుడ్‌లో న్యూట్రిషన్‌ కొరత ఉందన్నారు. మన లైఫ్‌ టైం 70 ఏళ్లకు తగ్గిపోయిందన్నారు. ప్రజలు ఉత్తమ వైద్యం కోసం హైదరాబాద్‌ వైపు చూస్తున్నారని తెలిపారు.


హైదరాబాద్‌కు గొప్ప వరం ఓఆర్ఆర్

దేశంలోని ఏ రాష్ట్రంతోనూ తెలంగాణకు పోటీ లేదని సీఎం రేవంత్ అన్నారు. హైదరాబాద్‌కు గొప్ప వరం ఒఆర్ఆర్ అని చెప్పారు. పెట్టుబడిదారులు తెలంగాణకు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. 2047లోపు దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలుస్తుందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేస్తామని సీఎం చెప్పారు.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Updated Date - Nov 14 , 2026 | 08:27 PM