Share News

హైదరాబాద్‌లో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్

ABN , Publish Date - Nov 14 , 2026 | 03:49 PM

దీపావళి పండుగ వేళ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన కుటుంబాన్ని టార్గెట్ చేసిన దొంగలు.. భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో భారీ చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నలుగురి అరెస్ట్
Vanasthalipuram

హైదరాబాద్, నవంబరు 14: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 14న తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఆటోనగర్‌లోని మోహన్ కాంతా ప్రాంతంలో బైక్‌పై అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 8న వనస్థలిపురంలోని సచివాలయ నగర్‌కు చెందిన వికాస్ కుమార్ అగర్వాల్ కుటుంబంతో కలిసి బయటకు వెళ్లారు. అదే అదనుగా భావించిన దొంగలు ఇంటి ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు, వెండి వస్తువులతో పాటు నగదును అపహరించారు. రాత్రి 8:30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన బాధితుడు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో గురువల్లి చంద్రశేఖర్ (30), సిరిగిడి ప్రకాశ్ (40), ఎటబోయిన అరవింద్ (20), సంతోళ్ల బాలకృష్ణ (36) ఉన్నారు. వీరి నుంచి 21 తులాల బంగారం, 15 గ్రాముల వజ్రాభరణాలు, 54 తులాల వెండి వస్తువులు, రూ.9 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నేరానికి ఉపయోగించిన ఐదు సెల్‌ఫోన్లు, పల్సర్ 150 బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి మార్గదర్శకత్వంలో, ఎల్బీనగర్ డీసీపీ బి. అనురాధ పర్యవేక్షణలో వనస్థలిపురం పోలీసు అధికారులు ఈ కేసును ఛేదించారు.


ఇవీ చదవండి

నోట్లో పేలిన నాటు బాంబు.. చికిత్స పొందుతూ యువకుడి మృతి

మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు

Updated Date - Nov 14 , 2026 | 05:19 PM