Share News

మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:36 PM

మహారాష్ట్రలోని మెళఘాట్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఐదు పులులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

మహారాష్ట్రలో నడిరోడ్డుపై పులులు.. భయంతో వణికిపోయిన ఉపాధ్యాయులు
Melghat Tiger Reserve

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని మెళఘాట్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఐదు పులులు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నవంబర్ 5న సాయంత్రం అటవీ మార్గంలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఈ అనూహ్య అనుభవం ఎదురైంది. గుగామల్ వన్యప్రాణి విభాగం పరిధిలోని రేంజ్‌లో ఢాక్నా-కోహా చెక్‌పోస్టు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సావర్యా జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు రామ్‌కుమార్ భాస్కర్, ఢాక్నా లక్ష్మీబాయి అభ్యంకర్ పాఠశాల సిబ్బంది ముకేశ్ ఇంగ్లే పాఠశాల పనులు ముగించుకుని సాయంత్రం 6.30 గంటల సమయంలో కారులో పరత్వాడా వైపు బయలుదేరారు.


కోహా వంతెన సమీపానికి చేరుకోగానే కారు హెడ్‌లైట్ల వెలుగులో ఒక్కసారిగా ఐదు పట్టెపులులు రోడ్డుపై కనిపించడంతో వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వారు కారును నిలిపివేశారు. పులుల్లో కొన్ని కారు వైపు కదులుతుండగా.. మరికొన్ని రోడ్డుపైనే తిష్టవేశాయి. దీంతో ముందుకు వెళ్లలేక.. వెనక్కి వెళ్లే పరిస్థితి లేక ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యంగా కారులోనే కదలకుండా ఉండిపోయారు. ఈ అరుదైన దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఒకేసారి ఐదు పులులు రోడ్డుపై ప్రత్యక్షం కావడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

Updated Date - Nov 13 , 2026 | 08:19 PM