Share News

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:19 PM

దీపావళి పండుగ విషాదంగా మారుతుందని తాను అనుకోలేదంటూ ఓ యువతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. పండుగ సందర్భంగా ఆఫీసులో తనకు బహుమతులు ఇస్తారని వెళితే జాబ్ పోయినట్టు వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి దీపావళి చూస్తానని అనుకోలేదు.. యువతి ఆవేదన

ఇంటర్నెట్ డెస్క్: దీపావళి పండుగ విషాదంగా మారుతుందని తాను అనుకోలేదని ఓ యువతి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. పండుగ సందర్భంగా ఆఫీసులో తనకు బహుమతులు ఇస్తారని వెళితే జాబ్ పోయినట్టు వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు తన భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని పేర్కొంది. జాబ్ పోయిన విషయం తల్లిదండ్రులకు చెబితే పెళ్లి చేసేస్తారన్న భయం వెంటాడుతోందని చెప్పింది.


గతంలో తాను గురుగ్రామ్‌లో ఓ గొప్ప కంపెనీలో పనిచేశానని ఆమె చెప్పింది. తన సామర్థ్యాన్ని నిరూపించుకుని ప్రమోషన్లు కూడా పొందినట్టు చెప్పింది. కానీ రోజంతా పనిచేయాల్సి రావడం, పని ఒత్తిడి కారణంగా తన ఆరోగ్యం చెడిపోయిందని పేర్కొంది. చివరకు ఆసుపత్రి పాలుకావాల్సి వచ్చిందని తెలిపింది. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వైద్యులు మరీ మరీ చెప్పడంతో మరో సంస్థలో చేరినట్టు చెప్పింది. అంతా ప్రశాంతంగా సాగుతోందని భావిస్తున్న తరుణంలోనే ఊహించని పరిస్థితి ఎదురైందని ఆమె వెల్లడించింది. పండుగకు మూడో రోజుల ముందు ఆఫీసుకు వెళితే ఊహించని షాక్ తగిలిందని తెలిపింది.

సంస్థను మూసేస్తున్నట్టు వ్యవస్థాపకుడు ఆ రోజు పిడుగులాంటి వార్త చెప్పడంతో తమకు ఊహించని షాక్ తగిలిందని ఆమె వ్యాఖ్యానించింది. పండుగ బహుమతులు ఉంటాయని అనుకుంటే నవంబర్ జీతాలు కూడా ఇవ్వలేనని ఆయన చెప్పినట్టు తెలిపింది. జాబ్ పోయిన విషయాన్ని తల్లిదండ్రులకు ఇంకా చెప్పలేదని ఆమె పేర్కొంది. విషయం తెలిస్తే తనకు తల్లిదండ్రులు పెళ్లి చేస్తారనే భయం ఉందని కూడా చెప్పింది. ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇతర నగరాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..

అమెరికాలో ఏడాదికి కోటి జీతం.. అయినా ఆర్థిక కష్టాలే అంటున్న భారతీయ మహిళ!

Updated Date - Nov 12 , 2026 | 11:32 PM