మహారాష్ట్రలో రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లిన విమానం..
ABN , Publish Date - Nov 12 , 2026 | 06:33 PM
మహారాష్ట్రలోని సోలాపూర్ విమానాశ్రయంలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఓ ట్రైనీ విమానం అదుపుతప్పి రన్‌వేపై స్కిడ్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని సోలాపూర్ విమానాశ్రయంలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. ఓ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన ట్రైనర్ విమానం టేకాఫ్ ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి రన్‌వే పక్కకు వెళ్లిపోయింది. దీంతో విమానం ముందుభాగం నేలను తాకుతూ ముందుకు ఒరిగిపోయింది. \
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో విమానాశ్రయంలో చోటుచేసుకున్న ప్రమాద తీవ్రతపై చర్చ జరుగుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్, పోలీసు బృందాలు విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మహిళా పైలట్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
తప్పిన పెను ప్రమాదం.. కారణాలపై ఆరా..
ట్రైనీ విమానం రన్‌వే నుంచి పక్కకు దూసుకెళ్లి ముందుభాగం నేలకు ఒరిగిపోవడంతో విమానాశ్రయ పరిసరాల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే విమానంలో ఉన్న పైలట్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదానికి గురైన విమానం ఏ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందినది, ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు, విమానం అదుపుతప్పడానికి అసలు కారణాలేంటి అనే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రమాదానికి గల కచ్చితమైన కారణం వెల్లడికాలేదు. విమానాశ్రయ అధికారులు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించాల్సి ఉంది. ఈ ఘటనతో శిక్షణ విమానాల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం: మంత్రి బీసీ జనార్దన్
కాలేజ్ యాజమాన్యం వేధింపులు.. ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం
Read Latest AP News And Telugu News