Share News

1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం: మంత్రి బీసీ జనార్దన్

ABN , Publish Date - Nov 12 , 2026 | 03:25 PM

ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ముఖద్వారంగా, దేశంలోనే ప్రముఖ మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోర్టులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.

1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం: మంత్రి బీసీ జనార్దన్
Minister BC Janardhan Reddy

విశాఖపట్నం, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌ను తూర్పు తీరానికి ముఖద్వారంగా, దేశంలోనే ప్రముఖ మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖ సీఐఐ సదస్సులో మంత్రి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోర్టులు, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు అతిపెద్ద వ్యూహాత్మక బలమని అన్నారు. రాష్ట్ర నాన్-మేజర్ పోర్టుల ద్వారా ఏటా 117 మిలియన్ టన్నులకు పైగా కార్గో నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టుల అభివృద్ధికి భారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. పోర్టులు, సముద్ర రంగ విస్తరణ కార్యక్రమంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు.


2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి మధ్య రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల కార్యకలాపాలను ప్రారంభించడమే లక్ష్యమని మంత్రి వెల్లడించారు. పోర్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర కార్గో నిర్వహణ సామర్థ్యం 195 MTPA నుంచి 286 MTPAకు పెరుగుతుందన్నారు. జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ల పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నంలో మత్స్యకార మౌలిక సదుపాయాలకు రూ.690 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు.


దుగ్గరాజపట్నంలో రూ.29,000 కోట్ల పెట్టుబడి సామర్థ్యంతో మెగా షిప్‌బిల్డింగ్ అండ్ మారిటైమ్ క్లస్టర్ ప్రతిపాదన ఉందని జనార్దన్ రెడ్డి తెలిపారు. నౌకా నిర్మాణం, మరమ్మతులు, మెరైన్ ఇంజినీరింగ్, సముద్ర పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో పెట్టుబడిదారులకు స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక మారిటైమ్ కేంద్రంగా నిలుస్తుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.


విశాఖ ఏయూ గ్రౌండ్స్ కాన్ఫరెన్స్ హాల్ -1లో జరిగిన సీఐఐ సమ్మిట్‌కు కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ కార్యదర్శి కోనా శశిధర్‌తో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వాగతం పలికారు.


ఇవి కూడా చదవండి...

విశాఖ సీఐఐ సదస్సులో పెట్టుబడుల ప్రకటనలు.. ఏపీపై పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు

ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 03:43 PM