Share News

నెమ్మదిగా అడుగులు వేస్తున్న రాప్తాడు బాలిక: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:02 PM

రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోంది. బాలిక నెమ్మదిగా అడుగులు వేస్తోందని, స్వయంగా ఆహారం తీసుకుంటోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

నెమ్మదిగా అడుగులు వేస్తున్న రాప్తాడు బాలిక: మంత్రి సత్యకుమార్
Satya Kumar Yadav

అమరావతి, నవంబర్ 12: రాప్తాడు జడ్పీ ఉన్నతపాఠశాలలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. క్రమక్రమంగా బాధితురాలి ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. బాలిక నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.


స్వయంగా శ్వాస తీసుకుంటోందని.. రాత్రి నిద్రలో మాత్రం స్వల్పంగా ఆక్సిజన్‌ సాయం అవసరం అవుతోందని మంత్రి చెప్పారు. వైద్య సిబ్బంది సహాయంతో బాధితురాలు నెమ్మదిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. వ్యాయామ చికిత్స కొనసాగుతోందన్నారు. బాలిక ముఖంపై కుట్లు తొలగించారని.. గాయాలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. మెత్తటి ఆహారాన్ని నోటి ద్వారా స్వయంగా తీసుకుంటోందన్నారు. రక్తపోటు, ఇతర ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నట్లు బెంగళూరు మణిపాల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

జనసేన నేతల పేర్లతో ఏడు కోట్ల రూపాయల మోసం..!

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 12 , 2026 | 12:26 PM