కాలేజ్ యాజమాన్యం వేధింపులు.. ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Nov 12 , 2026 | 03:56 PM
చిత్తూరు జిల్లాలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తిరుపతి జాతీయ రహదారిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు బలవన్మరణానికి యత్నించారు.
చిత్తూరు, నవంబర్ 12: జిల్లాలో ఇద్దరు విద్యార్థినిల ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. తిరుపతి జాతీయ రహదారిలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇద్దరు విద్యార్థినిలు బలవన్మరణానికి యత్నించారు. వీరిలో ఒకరు మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫీజులు చెల్లించలేదంటూ కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణంగా ఇద్దరు విద్యార్థినిలు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఇద్దరు విద్యార్థినుల్లో ఒకరు బీటెక్ రెండో సంవత్సరం చదువుతుండగా, మరొకరు సీఎస్‌ఈ చదువుతున్నారు.
ఇరువురూ నిద్రమాత్రలు మింగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఒకరు మృతిచెందగా.. మరో విద్యార్థిని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే విద్యార్థిని మృతిచెందిన విషయాన్ని కాలేజీ యాజమాన్యం దాచిపెట్డడంతో తోటి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి రోడ్డుపైకి వచ్చి భారీ ఎత్తున నిరసనకు దిగారు. దీంతో చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. కళాశాల వద్ద పరిస్థితి ఉధృతంగా మారింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు ప్రకటన
1,053 కి.మీ తీరప్రాంతం ఏపీకి వ్యూహాత్మక బలం: మంత్రి బీసీ జనార్దన్
Read Latest AP News And Telugu News