ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల ఆసక్తి: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Nov 12 , 2026 | 02:53 PM
31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా ప్రారంభమైందని మంత్రి పార్థసారథి అన్నారు. సీఐఐ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని తెలిపారు. మేధావులు, పాలసీ మేకర్స్, పారిశ్రామికవేత్తలను అనుసంధానించడమే సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.
విశాఖపట్నం, నవంబర్ 12: 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా ప్రారంభమైందని మంత్రి పార్థసారథి అన్నారు. సీఐఐ సదస్సుకు వివిధ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని తెలిపారు. మేధావులు, పాలసీ మేకర్స్, పారిశ్రామికవేత్తలను అనుసంధానించడమే సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు అనేక మంచి పారిశ్రామిక విధానాలు తీసుకొస్తున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 30కి పైగా పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చామన్నారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సీఎం ఆలోచన చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఎస్క్రో అకౌంట్ తీసుకువచ్చారని.. ఇప్పటికే రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు కార్యరూపంలోకి వచ్చాయన్నారు. చదువుతో పాటు నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యమని చెప్పుకొచ్చారు. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయబోతున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పెట్టుబడిదారులకు ఏపీ నుంచి స్వాగతం పలుకుతున్నామని అన్నారు.
ఏపీ అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత పాలకుల ఆలోచనలు, విధానాలు ప్రజలకు తెలుసన్నారు. విభజన హామీల్లో వారి ప్రాంతానికి ప్రకటించిన స్టీల్ ప్లాంట్‌ను సాధించలేకపోయారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కృత్రిమంగా ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు చేశారంటూ మంత్రి పార్థసారథి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
విశాఖ సీఐఐ సదస్సులో పెట్టుబడుల ప్రకటనలు.. ఏపీపై పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
ఏపీకి రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు.. విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు ప్రకటన
Read Latest AP News And Telugu News