23 పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు షెడ్యూల్ విడుదల!
ABN , Publish Date - Nov 12 , 2026 | 01:47 PM
పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలిదశ పంచాయతీలతో పాటే వీటికీ ఈ నెల 26నే పోలింగ్ నిర్వహిస్తారు.
విజయవాడ, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. గురువారం నాడు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు.. పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్లు, పోలింగ్, ఫలితాల వివరాలను వెల్లడించారాయన.
ఎస్ఈసీ వెల్లడించిన వివరాల ప్రకారం..
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
నవంబర్ 13న గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నోటిఫికేషన్ కానుంది.
15వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
17వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ
18వ తేదీన నామినేషన్ల పరిశీలన
19, 20 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణ, సంబంధిత అంశాలపై అప్పీళ్లకు అవకాశం
21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు
21వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన
26వ తేదీన పోలింగ్
26వ తేదీన ఫలితాల వెల్లడి
27వ తేదీన రీపోలింగ్ (ఎక్కడైనా పోలింగ్ రద్దైన.. వాయిదా పడిన చోట)
రెండవ విడత పంచాయతీ ఎన్నికలు..
నవంబర్ 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
20వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ
21వ తేదీన నామినేషన్ల పరిశీలన
22, 23 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణ, సంబంధిత అంశాలపై అప్పీళ్లకు అవకాశం
24వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు
24వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన
29వ తేదీన పోలింగ్
29వ తేదీన ఫలితాల వెల్లడి
30వ తేదీన రీపోలింగ్ (ఎక్కడైనా పోలింగ్ రద్దైన.. వాయిదా పడిన చోట)
3వ విడత పంచాయతీ ఎన్నికలు..
నవంబర్ 19వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
23వ తేదీ నామినేషన్ల స్వీకరణ చివరి తేదీ
24వ తేదీన నామినేషన్ల పరిశీలన
25, 26 తేదీల్లో నామినేషన్ల తిరస్కరణ, సంబంధిత అంశాలపై అప్పీళ్లకు అవకాశం
27వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు
27వ తేదీన పోటీలో నిలిచిన అభ్యర్థుల ప్రకటన
డిసెంబర్ 2వ తేదీన పోలింగ్
డిసెంబర్ 2వ తేదీన ఫలితాల వెల్లడి
డిసెంబర్ 3వ తేదీన రీపోలింగ్ (ఎక్కడైనా పోలింగ్ రద్దైన.. వాయిదా పడిన చోట)
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ లిక్కర్ కేసు.. తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్
ఏపీ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తాం