Share News

హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన కేసీఆర్‌

ABN , Publish Date - Nov 16 , 2026 | 06:26 AM

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు.

హరీశ్‌రావు నివాసానికి వెళ్లిన కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు నివాసానికి వెళ్లారు. ఆదివారం కోకాపేటలోని హరీశ్‌ రావు నివాసంలో తన తండ్రి సత్యనారాయణరావు సంవత్సరీకం కార్యక్రమాన్ని నిర్వహించారు.


కేసీఆర్‌ ఇందులో పాల్గొని సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును ఆయన కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ అధినేత పరామర్శించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ,కుటుంబ సభ్యులు హాజరయ్యారు.



ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 06:26 AM