Share News

21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి, హరీశ్‌రావు ఆత్మీయ కలయిక

ABN , Publish Date - Nov 29 , 2026 | 01:16 AM

తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌ రావు 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్నారు.

21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి, హరీశ్‌రావు ఆత్మీయ కలయిక

  • కుమారుడి పెళ్లి సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతానికి మాజీ మంత్రిని ఆహ్వానించిన జగ్గారెడ్డి

  • జగ్గారెడ్డి ఇంటికి వచ్చి వధూవరులను ఆశీర్వదించిన హరీశ్‌

  • తమది ఆత్మీయ కలయికే తప్ప రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేసిన ఇరువురు నేతలు

  • కార్యక్రమానికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి.. వధూవరులకు ఆశీర్వాదాలు

సంగారెడ్డి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యర్థులుగా కొనసాగుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌ రావు 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన తన కుమారుడి వివాహం సందర్భంగా జగ్గారెడ్డి.. సంగారెడ్డి పట్టణంలోని రాంనగర్‌లో గల నివాసంలో శనివారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గారెడ్డి ఆహ్వానం మేరకు హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు భరత్‌సాయి రెడ్డి-పాలక్‌ పటేల్‌లను హరీశ్‌ ఆశీర్వదించారు.


అనంతరం ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 2004లో హరీశ్‌ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చాంబర్‌లో ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లమని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత ఇప్పటి వరకు హరీశ్‌ను వ్యక్తిగతంగా కలవలేదని, 21 ఏళ్ల తర్వాత తొలిసారిగా కుటుంబ వేడుకలో కలుసుకున్నామని తెలిపారు. తమ ఇద్దరి కలయిక వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు, మతలబులు లేవని ఇరువురు నేతలు స్పష్టం చేశారు.


Untitled-1 copy.jpgUntitled-1 copy.jpgవధూవరులను ఆశీర్వదించిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి

జగ్గారెడ్డి నివాసంలో జరిగిన సత్యనారాయణ వ్రతానికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా హాజరయ్యారు. నూతన వధూవరులు భరత్‌ సాయి రెడ్డి-పాలక్‌ పటేల్‌లను వారు ఆశీర్వదించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 01:23 AM