Share News

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN , Publish Date - Aug 31 , 2026 | 10:27 AM

సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మాపూర్‌లో రూ.7.28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు.

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar

సిద్దిపేట జిల్లా, ఆగస్టు 31: జిల్లాలోని హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన కొనసాగుతోంది. ఉమ్మాపూర్‌లో రూ.7.28 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల బాలికలు, బాలుర నూతన హాస్టల్ భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. హుస్నాబాద్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మారుస్తామన్నారు. వచ్చే సంవత్సరం ఆగస్టు లోపు ఇంజినీరింగ్ కళాశాలను పూర్తి చేసి జాతీయ జెండా ఎగరవేస్తామని చెప్పారు.


తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ హుస్నాబాద్ నియోజకవర్గంలోనే పూర్తవుతుందని మంత్రి తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ కళాశాలకు త్వరలో మరో రెండు బస్సు తీసుకొస్తామని వెల్లడించారు. విద్యా ప్రమాణాలు బాగుంటేనే విద్యాసంస్థలు అభివృద్ధి చెందుతాయన్నారు. త్వరలో హుస్నాబాద్‌కు కబడ్డీ అకాడమీని తీసుకొస్తామన్నారు. సౌకర్యాలు మావి ర్యాంకులు తెచ్చే బాధ్యత మీది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

విశాఖలో రోడ్డు ప్రమాదం.. క్షణాల్లో దగ్ధమైన కారు, డ్రైవర్ సజీవ దహనం

వాట్సాప్‌లో ఫ్రెండ్స్‌కు మెసేజ్.. కానిస్టేబుల్ బలవన్మరణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 10:32 AM