Share News

ప్రభుత్వంలో చచ్చిపోతేనే పనులవుతాయా?

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:16 AM

బిల్లుల కోసం చావడానికైనా సిద్ధమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చెబుతుండగా, రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగం చేస్తానని రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు అంటున్నాడని..

ప్రభుత్వంలో చచ్చిపోతేనే పనులవుతాయా?
Harish Rao

  • రూ.లక్ష కోట్లపైగా అప్పుల్లో పౌరసరఫరాల సంస్థ

  • రూ.600కోట్ల బియ్యాన్ని పందికొక్కుల పాల్జేశారు: హరీశ్‌

గజ్వేల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): బిల్లుల కోసం చావడానికైనా సిద్ధమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చెబుతుండగా, రేషన్‌ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగం చేస్తానని రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు అంటున్నాడని.. అంటే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చచ్చిపోతేనే పనులవుతాయా? అని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పిదాల వల్లే పౌరసరఫరాల సంస్థ రూ.లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. సుమారుగా రూ.600 కోట్ల విలువైన దొడ్డు బియ్యాన్ని పందికొక్కుల పాలు చేశారని, ఉత్తమ్‌ పనితీరుకు ఇదే కొలమానమని ధ్వజమెత్తారు.


సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌లో మంగళవారం నిర్వహించిన రేషన్‌ డీలర్ల రాష్ట్రవ్యాప్త సభకు ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. తక్షణమే రేషన్‌ డీలర్ల సంఘాన్ని చర్చలకు పిలిచి వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాగా, అధికార పక్షంలో ఉంటే సమస్యలపై ప్రశ్నించవద్దా? అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అనిరుధ్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని హమీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు

జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్‌!

పంటల ధరలు పైపైకి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 06:16 AM