బతికున్నోళ్లకూ డెత్ సర్టిఫికెట్లు!
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:15 AM
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహస్యంగా ఉండాల్సిన ‘డిజిటల్ కీ’ని (ఈ-సైన్ డొంగల్).. ప్రభుత్వ బాధ్యత, డిజిటల్ భద్రతను పక్కనబెట్టి ప్రైవేటు వ్యక్తి చేతికి అప్పగిస్తే ఏమవుతుందో చెప్పే ఘటన ఇది.
6 నెలల్లో 22 మరణ ధ్రువీకరణ పత్రాలు
ప్రభుత్వ ‘డిజిటల్ కీ’ ప్రైవేట్ వ్యక్తి చేతికి..
సిద్దిపేటలో పంచాయతీ కార్యదర్శి నిర్వాకం
చేర్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం రహస్యంగా ఉండాల్సిన ‘డిజిటల్ కీ’ని (ఈ-సైన్ డొంగల్).. ప్రభుత్వ బాధ్యత, డిజిటల్ భద్రతను పక్కనబెట్టి ప్రైవేటు వ్యక్తి చేతికి అప్పగిస్తే ఏమవుతుందో చెప్పే ఘటన ఇది. బతికున్న వారి పేరిట మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఏకంగా డెత్ సర్టిఫికేట్ల దందా నడిపిన వ్యవహారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలో వెలుగు చూసింది. రాంపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మధు తన వద్ద ఉండాల్సిన ‘ఈ-సైన్ డొంగల్ కీ’ని హైదరాబాద్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన శవల్ల రమేశ్‌కు అప్పగించారు. ఈ కీని ఆసరాగా చేసుకున్న రమేశ్, గత ఆరు నెలల్లో ఏకంగా 22 నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించాడు.
ఇన్సూరెన్స్ సొమ్ము దండుకోవడానికో.. భూసంబంధిత వివాదాలు, మోసాల కోసమో.. తన కుటుంబసభ్యులతో పాటు మరికొందరు బతికున్న వ్యక్తుల పేరిట నకిలీ డెత్ సర్టిఫికేట్లు జారీ చేసినట్లు తెలిసింది. పంచాయతీ కార్యదర్శి మధు నిర్లక్ష్యంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు కొద్ది కాలం క్రితం ఆయనను గ్రామ పంచాయతీ బాధ్యతల నుంచి తప్పించి ఎంపీడీవో కార్యాలయంలో విధులు అప్పగించారు. అయితే, నకిలీ సర్టిఫికేట్ల దందా కలెక్టర్ దృష్టికి రావడంతో తీవ్రంగా పరిగణించిన ఆయన, కార్యదర్శి మధును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, ఎంపీవో ఇచ్చి ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శి మధుతో పాటు ఇంటర్నెట్ నిర్వాహకుడు రమేశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై విచారణాధికారిగా డీఎల్‌పీవోను నియమించినప్పటికీ, విచారణ వేగవంతం కాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News