పొలంలో జింక ప్రత్యక్షం
ABN , Publish Date - Mar 04 , 2026 | 12:52 PM
కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక ప్రత్యక్షమైంది.
- అడవిలో విడిచిపెట్టిన అధికారులు
కొండపాక(సిద్దిపేట): కొండపాక మండలం వెలికట్ట శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం సాయంత్రం జింక(Deer) ప్రత్యక్షమైంది. అడవి నుంచి తప్పిపోయి వచ్చిన ఈ జింక, పెట్రోల్ బంకు వెనుక ఉన్న వరి పొలంలోని బురద మడిలో దిగబడిపోయింది. గమనించిన రైతులు వెంటనే అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫారెస్టు అధికారులు జింకను సురక్షితంగా బయటకు తీసి, సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News