Share News

రైలు పట్టాల పక్కన కనిపించే బోర్డుల వెనుక ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా?

ABN , Publish Date - Mar 04 , 2026 | 10:32 AM

భారత దేశంలో రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటి. సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రాక్ ఇరువైపులా కొన్ని రకాల సిగ్నల్స్, బోర్డులపై అక్షరాలు కనిపిస్తుంటాయి.

రైలు పట్టాల పక్కన కనిపించే బోర్డుల వెనుక ఉన్న అర్థం ఏంటో మీకు తెలుసా?
Railway Track Boards Meaning

ఇంటర్నెట్ డెస్క్: భారత దేశంలో రైల్వే నెట్‌వర్క్(Railway network) ప్రపంచంలోనే అతి పెద్ద వాటిలో ఒకటి. దేశంలో చాలా మంది ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారు. మనం రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే పట్టాల పక్కన రక రకాల సిగ్నల్స్, బోర్డులపై అక్షరాలు కనిపిస్తుంటాయి. ఇవి కేవలం గుర్తులు మాత్రమే కాదు, లోకో పైలట్లకు దిశానిర్దేశం చేసే కీలకమైన 'ట్రాఫిక్ సిగ్నల్స్'. ప్రయాణికుల భద్రతలో ఈ బోర్డులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ బొర్డుల అర్ధాలు ఏంటో తెలుసుకుందాం.


సాధారణంగా రైల్వే ట్రాక్ పక్కన ఉండే W/L లేదా C/F అక్షరాలు పసుపు రంగు బోర్డుపై కనిపిస్తుంటాయి. పసుపు ప్రకాశవంతమైన కలర్.. ఇది పగలు, రాత్రి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే పసుపు రంగు బోర్డులపై అక్షరాలు రాస్తుంటారు. W/L అర్ధం అంటే విజిల్ / లెవెల్ బోర్డ్. ఇది ట్రాక్‌లపై రెండు వైపులా ఏర్పాటు చేస్తారు. భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్లో తెలిపిన వివరాల ప్రకారం.. లోకో పైలట్ ను అప్రమత్తం చేయడానికి ఈ బోర్డు ఉపయోగపడుతుంది అన్ మ్యాన్ లేదా మ్యాన్ క్రాసింగ్ ఉన్నచోట్ల దీనిని ఏర్పాటు చేస్తారు. రైలు క్రాసింగ్ దగ్గరికి వస్తున్నప్పుడు లోకో పైలట్ తప్పనిసరిగా హారన్ మోగించాలనే సూచన. ఈ బోర్డు సాధారణంగా క్రాసింగ్ కి 250 నుంచి 300 మిటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు.


C/F లేదా C/Fa అంటే Whistle Blowing/Gate అని అర్థం. దీని ఉద్దేశ్యం కూడా అదే.. లోకో పైలట్ హరన్ మోగించడం ద్వారా ముందు ఉన్న ప్రజలు, వాహనాలు, జంతువులు జాగ్రత్త పడతాయి. కాపలా లేని రైల్వే గేట్ల వద్ద ప్రజలు రైలు వస్తున్న విషయాన్ని గమనించకపోవచ్చు. డ్రైవర్ హారన్ వేయడం వల్ల ట్రాక్ వద్ద ఉన్నవాళ్లు, జంతువులు అలర్ట్ దూరంగా వెళ్తాయి. దీని వల్ల ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గిపోతాయి. ఈ బోర్డులు సాధారణంగా గేటుకు సుమార 600 మీటర్ల ముందే ఉంటాయి. దీంతో డ్రైవర్ సరైన సమయంలో హారన్ కొట్టడానికి వీలు ఉంటుంది.


ఇవి కూడా చదవండి..

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 11:05 AM