నారాయణపేట మెడికల్ కాలేజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:09 AM
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
నారాయణపేట క్రైం, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్‌లో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హాస్టల్ గదిలో ఉన్న ఏడుగురు విద్యార్థినులు సురక్షితంగా బయటపడగా.. వారికి సంబంధించిన స్టడీ మెటీరియల్స్, దుస్తులు, ట్యాబ్‌తో పాటు ఇతర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న ఈ హాస్టల్‌లో సుమారు 60 మంది విద్యార్థినులు ఉంటున్నారు. చివరి సంవత్సరం విద్యార్థినులు ఉంటున్న రెండో అంతస్తులోని ఓ గదిలో ఈ ప్రమాదం జరిగింది.
ఓ విద్యార్థిని వేడినీటి కోసం ఉదయం ఓ బకెట్‌లో హీటర్‌ను ఉంచగా.. అందులో విద్యుత్‌షాక్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ గది మొత్తం వ్యాపించాయి. అదే గదిలో నిద్రిస్తున్న ఇతర విద్యార్థినులు మేల్కొని వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఘటనా స్థలాన్ని ఆర్డీవో రమేశ్, ప్రిన్సిపాల్ సంపత్ పరిశీలించారు. కాగా, హాస్టల్ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందనలేదని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి పెద్ద సంఖ్యలో వెళ్లి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News