దొంగతనం కేసులో విచారణ.. యువకుడి అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:48 AM
దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఫిట్స్ రావడంతోనే చనిపోయాడంటున్న పోలీసులు
మహబూబ్‌నగర్ జిలా జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): దొంగతనం కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన తరుణ్ (25) జడ్చర్లలోని ఓ లాడ్జిలో పని చేస్తున్నాడు. శనివారం లాడ్జికి సంబంధించిన ల్యాప్‌ట్యాప్ చోరీ చేసి పరారవడంతో యజమాని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం లాడ్జి యాజమాన్యం, సిబ్బంది గాలింపు చేపట్టగా, ఆదివారం బాలానగర్ వద్ద దొరికాడు. ల్యాప్‌ట్యా్‌పతో పాటు తరుణ్‌ను పోలీసులకు అప్పగించారు.
ఈ క్రమంలో పోలీసులు అతడిని విచారిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే తరుణ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విచారణ సమయంలో ఫిట్స్ రావడంతోనే తరుణ్ మరణించాడని పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే, యువకుడి మృతిపై అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు. కాగా, విచారణకు ముందే తరుణ్ మద్యం తాగి ఉన్నాడని, డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లో రీడింగ్ 113గా నమోదైందని జడ్చర్ల సీఐ కమలాకర్ తెలిపారు. ఈ దృశ్యాలు పోలీస్ స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News