Share News

డిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపాలి: సీఎం రేవంత్‌కు డీకే అరుణ డిమాండ్

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:56 PM

నీవు నిజమైన పాలమూరు బిడ్డవే అయితే డిండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. అప్పుడే నిన్ను కొండారెడ్డి పులిబిడ్డ అంటారని పేర్కొన్నారు.

డిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ఆపాలి: సీఎం రేవంత్‌కు డీకే అరుణ డిమాండ్
Mahabubnagar MP DK Aruna

జడ్చర్ల, అక్టోబర్16: నీవు నిజమైన పాలమూరు బిడ్డవే అయితే డిండి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు. అప్పుడే నిన్ను కొండారెడ్డి పులిబిడ్డ అంటారని పేర్కొన్నారు. శుక్రవారం జడ్చర్లలో బీజేవైఎం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో డిండి ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపి వేయాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశారు.


గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పక్కన పెట్టిన ఈ ప్రాజెక్టును మళ్లీ మీరెందుకు చేపడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ఎంపీ సూటిగా ప్రశ్నించారు. పాలమూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రిని చేసినందుకు ఈ ప్రాంత రైతుల గొంతులు కోస్తావా? అంటూ సీఎం రేవంత్‌పై నిప్పులు చెరిగారు. మీ స్వార్థం చూసుకోకండి పాలమూరు కరువును చూడండంటూ నల్గొండ రెడ్డిలకు ఈ సందర్భంగా ఎంపీ అరుణ సూచించారు. పాలమూరు జిల్లా కన్నా అధిక ఆయకట్టు నల్గొండ జిల్లాలోనే ఉందని గుర్తు చేశారు.


మీరు బాగుండాలి మేము బాగుండాలనే గుణం ఉండాలి కానీ.. మేమే బాగుండాలనే ఉద్దేశం మంచిది కాదని వారికి డీకే అరుణ హితవు పలికారు. పాలమూరుని ఎండబెట్టాలనే ఉద్దేశంతోనే డిండి ప్రాజెక్టును తెస్తున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు. పాలమూరు వలసలు కొనసాగించాలనేదే మీ ఉద్దేశ్యమా? అని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్ట్ నిర్మాణంతో పాలమూరు జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా వారంతా భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. అయితే గత ప్రభుత్వ హయాంలో తమ ఒత్తిడితోనే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం నిలిపి వేశారని గుర్తు చేశారు. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి ఆ జిల్లా ప్రజలు గొంతు కోస్తావా? అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను నిలదీయడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ప్రస్తావించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నెల్లూరులో వైసీపీకి గట్టి షాక్

పుంగనూరులో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: జిల్లా ఎస్పీ

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 09:20 PM