Share News

నెల్లూరులో వైసీపీకి గట్టి షాక్

ABN , Publish Date - Oct 16 , 2026 | 07:30 PM

వైసీపీలో నేతలతోపాటు వారి అనుచరగణం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దాదాపుగా ఇదే పరిస్థితి. దీంతో ఆ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

నెల్లూరులో వైసీపీకి గట్టి షాక్

నెల్లూరు, అక్టోబర్16: వైసీపీలో నేతలతోపాటు వారి అనుచరగణం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు దాదాపుగా ఇదే పరిస్థితి. దీంతో ఆ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా నెల్లూరు నగరంలో సన్నపురెడ్డి సోదరులు టీడీపీలో చేరారు. శుక్రవారం మంత్రి నారాయణ, గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.. వారిందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


వైసీపీ నేతల ఒంటెద్దు పోకడలు నచ్చకే తామంతా టీడీపీలో చేరుతున్నట్లు ఈ సందర్భంగా సన్నపురెడ్డి సోదరులు ప్రకటించారు. అయితే సన్నపురెడ్డి సోదరులు వైసీపీని వీడి.. టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి నారాయణతోపాటు మిగిలిన నేతలకు సమాచారం అందింది. దీంతో వారంతా నెల్లూరులోని వారి కార్యాలయానికి స్వయంగా వెళ్లారు. అక్కడే సన్నపురెడ్డి సోదరులు టీడీపీలో చేరారు.


దీంతో బాలా నారాయణరెడ్డి, జయపాల్‌తోపాటు వారి అనుచరగణమంతా టీడీపీ గూటికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. ఎన్నికల నామినేషన్ల ప్రకియ కూడా ప్రారంభమైంది. దీంతో వైసీపీని వీడి టీడీపీలో చేరే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పలు జిల్లా్ల్లో వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు గంపగుత్తగా రాజీనామాలు చేస్తున్నారు. వారంతా టీడీపీలో చేరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పుంగనూరులో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: జిల్లా ఎస్పీ

పుంగనూరు దాడులపై వైసీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 07:49 PM