Share News

పుంగనూరు దాడులపై వైసీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్

ABN , Publish Date - Oct 16 , 2026 | 06:10 PM

టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ దాడులపై తిరుపతిలో ఆయన స్పందించారు.

పుంగనూరు దాడులపై వైసీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్
TDP MLA Bojjala Sudheer Reddy

తిరుపతి, అక్టోబర్ 16: టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా పుంగనూరులో వైసీపీ దాడులపై తిరుపతిలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నిజంగానే గొడ్డలి పార్టీగా మారిపోయిందని విమర్శించారు. పుంగనూరులో వాహనాలను మనుషులపైకి ఎక్కించారని మండిపడ్డారు.


తాగి రౌడీయిజం చేస్తే ఇక తాము చూస్తూ ఊరుకోమని వైసీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఓ రెడ్డిగా ఈరోజు మిథున్ రెడ్డి, అభినయ రెడ్డి చేసిన వ్యవహారాన్ని చూసి తాను ఖండిస్తున్నానని చెప్పారు. రాజకీయాలలో రెడ్లు ఇలా చేయరని తెలిపారు. వారు ప్రజా మద్దతు పొందుతారని పేర్కొన్నారు.


గత ఐదేళ్లలో ప్రతి ఎన్నికల్లోనూ ఘర్షణలు, గుండాయిజం చేసింది వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి అని ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు సహనం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓర్పు చూసి చేతకానితనం అని వైసీపీ నేతలు అనుకుంటున్నారని తెలిపారు. ఇక నుంచి తాము సీఎం, డిప్యూటీ సీఎం మాట వినదలుచుకో లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పుంగనూరులో వైసీపీ దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ: వర్ల రామయ్య

ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనం కేసులో సోదాలకు ఈడీ సిద్ధం

For More AP News And Telugu News

Updated Date - Oct 16 , 2026 | 06:51 PM