పుంగనూరులో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు: జిల్లా ఎస్పీ
ABN , Publish Date - Oct 16 , 2026 | 07:07 PM
పుంగనూరు ఘటనలో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుమిల్లి వెల్లడించారు.
మదనపల్లి, అక్టోబర్16: పుంగనూరు ఘటనలో శాంతిభద్రతలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుమిల్లి వెల్లడించారు. శుక్రవారం పుంగనూరులో జిల్లా ఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నేతృత్వంలో భారీ ఎత్తిన పార్టీ శ్రేణులు తరలి వచ్చాయని తెలిపారు. ఆయన ఇంటి దగ్గర నుంచి నామినేషన్ కేంద్రం వరకు 6 వాహనాల్లో వచ్చారని వివరించారు. కానీ ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ సెంటర్ లోపలికి అభ్యర్థితో పాటు మరో ఇద్దరు వ్యక్తులే వెళ్లాల్సి ఉందని అన్నారు.
ఎంపీ మిథున్ రెడ్డి ఆ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లు, గేట్లను ఢీకొట్టి అతి వేగంగా లోపలకు వచ్చారని పేర్కొన్నారు. వారు ఇలా రావడాన్ని అక్కడే ఉన్న టీడీపీ అభ్యర్థి సహా అక్కడ ఉన్న వారంతా అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని.. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారని తెలిపారు.
అయితే నామినేషన్ సెంటర్ వద్దకు ఓ వాహనం అతి వేగంగా వచ్చి.. అక్కడున్న వారిపై దూసుకెళ్లడంతో కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించామని జిల్లా ఎస్పీ ధీరజ్ కానుమిల్లి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పుంగనూరు దాడులపై వైసీపీకి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వార్నింగ్
పుంగనూరులో వైసీపీ దాడులపై ఎస్ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించిన వైసీపీ ఎంపీ: వర్ల రామయ్య
For More AP News And Telugu News