Share News

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:47 PM

ఖమ్మం జిల్లా సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు.

రూ.550 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో ముగ్గురి అరెస్టు..
Cyber Crime

ఖమ్మం జిల్లా: సత్తుపల్లి సైబర్ నేరాల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ కేసులో సీఆర్‌వోలు ఓర్సు కృప, మంద శ్రీహరిబాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సత్తుపల్లి సీఐ శ్రీహరి అరెస్టు చేశారు. ఈ కేసులో ఉడతనేని వికాస్ చౌదరి, బొప్పన నాగప్రియ, చండ్రుగొండకు చెందిన బ్యాంక్ మేనేజర్ అఖిల్ అబ్దుల్ ఇప్పటికే అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే, విచారణ సందర్భంగా తాజాగా అరెస్టయిన ముగ్గురు నిందితులు వారికి సహకరించినట్లు తేలింది.


ఈ మేరకు ఓర్సు కృప, మంద శ్రీహరి బాబు, బీఆర్‌వో జుంజునూరి రాధాకృష్ణను సీఐ శ్రీహరి అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు. కాగా, రూ.549.95 కోట్లు దోచుకున్న కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులంతా అంతర్జాతీయ సైబర్‌ నేరస్థులతో చేతులు కలిపినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులు, బెట్టింగ్, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, క్రిప్టో కరెన్సీ వంటి మోసాలకు నిందితులు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి 24 మందిపై కేసు నమోదు కాగా ఇప్పటికే చాలా మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.


ఈ వార్తలు కూడా చదవండి

రాజ్యసభలో బీఆర్‌ఎస్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Updated Date - Apr 02 , 2026 | 04:09 PM