Share News

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:10 PM

గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లకుండ ఇచ్చి పోయారంటూ వైసీపీపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.

ఏపీని అప్పుల ఊబిలో నెట్టేశారు.. వైసీపీపై మంత్రి రామానాయుడు ఆగ్రహం
Nimmala Ramanaidu

రాజమండ్రి, ఏప్రిల్ 2: గత వైసీపీ పాలనలో ఏపీలో విధ్వంసం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) వ్యాఖ్యలు చేశారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జరిగిన తూర్పుగోదావరి జిల్లా బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనతోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీదకు వెళ్లిందన్నారు. నాడు తాడేపల్లి, ఇడుపులపాయ ఖజానాలు నింపుకొని.. రాష్ట్ర ఖజానా లూటీ చేశారని ఆరోపించారు.


గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఖాళీ చిల్లుకుండ ఇచ్చి పోయారంటూ మంత్రి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25లో జీఎస్‌డీపీ11.89 శాతం వృద్ధి సాధించామని తెలిపారు. గత పాలనలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించుకుంటూనే, అభివృద్ధితో పాటు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నామన్నారు. వేసవిలో గోదావరి డెల్టా ప్రధాన కాలువలలో సిల్టును తొలగించేందుకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.


గోదావరి డెల్టా లైడార్ సర్వే పూర్తయిందని.. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేస్తామని చెప్పారు. ఈనెల 15 నాటికి గోదావరి డెల్టాకు రబీ సీజన్ పూర్తవుతుందన్నారు. అవసరమైతే రైతుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గోదావరి డెల్టా కాలువలకు సాగునీరు సరఫరా పొడిగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యసభ నుంచి వాకౌట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:15 PM