Share News

అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యసభ నుంచి వాకౌట్

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:00 PM

రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదని ఆయన అన్నారు.

అమరావతి బిల్లును వ్యతిరేకించిన వైసీపీ.. రాజ్యసభ నుంచి వాకౌట్
Amaravati Capital Bill

న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: అమరాతి చట్టబద్ధత బిల్లుపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. లోక్‌సభలో వ్యతిరేకించిన విధంగానే రాజ్యసభలోనూ ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. చర్చలో భాగంగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై బిల్లులో లేదన్నారు. అమరావతిలో ఒక్క శాశ్వత నిర్మాణమైనా జరగలేదని తెలిపారు. రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో స్పష్టత లేదన్నారు. రాజ్యాంగంలో రాజధాని అంశం ఎక్కడ ఉందని ఎంపీ ప్రశ్నించారు. అనేక అంశాలపై బిల్లులో క్లారిటీ లేదన్నారు.


అమరావతిని వైసీపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించారని.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు అంటున్నారని తెలిపారు. రెండేళ్లలోనే రూ.3.40 లక్షల కోట్ల అప్పు చేశారని.. ఇలాగే కొనసాగితే రూ.14 లక్షల కోట్లకు అప్పు చేరుతుందని చెప్పుకొచ్చారు. అమరావతి అతిపెద్ద కుంభకోణమని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆపై అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.


ఇవి కూడా చదవండి...

జగన్‌ ప్లాన్ బి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: కన్నా లక్ష్మీనారాయణ

అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 03:04 PM