జగన్ ప్లాన్ బి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: కన్నా లక్ష్మీనారాయణ
ABN , Publish Date - Apr 02 , 2026 | 01:06 PM
అమరావతిపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా మావిగన్ అంటున్నారని విమర్శించారు.
గుంటూరు, ఏప్రిల్ 2: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ(MLA Kanna Laxminarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధానిగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని.. గతంలో జగన్ కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నారని తెలిపారు. 2019 ఎన్నికల ప్రచారంలో అమరావతే రాజధాని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాటాడి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. వైజాగ్‌ను జగన్ సర్వనాశనం చేశారని.. ఉత్తరాంధ్ర ప్రజలు బెంబేలెత్తిపోయారన్నారు.
2024లో ఎన్డీయే కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. జగన్.. ప్రజాభిప్రాయానికి గౌరవం ఇచ్చే రాజకీయ నాయకుడైతే అమరావతి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పేవారన్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యంగ్యంగా మావిగన్ అంటున్నారని విమర్శించారు. కర్నూలులో హైకోర్ట్ ఏర్పాటుకు గత ప్రభుత్వ పాలనలో తీర్మానం చేశారా అని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో చట్టం చేసిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారని తెలిపారు. అమరావతి నుంచి పూచిక పుల్ల కూడా కదిలించలేరని ఆనాడే చెప్పానని తెలిపారు. పరిజ్ఞానం లేకుండా ప్లాన్ బి అంటూ మాట్లాడే మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల
అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నారు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News