Share News

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

ABN , Publish Date - Apr 02 , 2026 | 11:04 AM

ఏపీ ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కార్ భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది.

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల
AP Govt

అమరావతి, ఏప్రిల్ 2: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేపట్టారు. ఈ మేరకు ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7,059 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రణాళికాబద్ధంగా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే.


తాజా చెల్లింపుల్లో ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లు, గ్రాట్యుటీ కింద రూ.3,411.03 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద రూ.1,800 కోట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవుల కింద రూ.223.47 కోట్లు విడుదల చేశారు. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ నిమిత్తం 4,793 మంది ఉద్యోగులకు రూ.76 కోట్ల చెల్లింపులు జరిగాయి. రూ.7,059 కోట్ల మేరకు బిల్లుల చెల్లింపు ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది.


ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లను ఉద్యోగుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిన విషయం తెలిసిందే. జీఎల్ఐ కింద రూ.76 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి అయ్యాయి. అలాగే వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల మేర పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరిగాయి.


ఇవి కూడా చదవండి...

అమరావతికి జై

హైదరాబాద్‌లో విషాదం.. ఆడిషన్‌కు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 11:36 AM