అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Apr 02 , 2026 | 01:32 PM
రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులంతా సంబరాలు జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు.
అమరావతి, ఏప్రిల్ 2: జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు నేడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందనుందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులంతా పండగ వాతావరణంలో సంబరాలు జరపాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఇంట్లో, జనసేన కార్యాలయాల్లో దీపాలు వెలిగించాలని సూచించారు. దీపాలు వెలిగించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలన్నారు.
రాజధాని కోసం జరిగిన పోరాటంలో అమరావతి రైతులు, మహిళలకు జనసేన పార్టీ, పవన్ కల్యాణ్ ఏ విధంగా అండగా నిలబడ్డారన్న విషయం ప్రజలకు వివరించాలని మంత్రి సూచనలు చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడంలో పవన్ చేసిన కృషిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకే ఒక రాజధాని ఉంటుందని.. అది అమరావతే అని ఆనాడు పవన్ కల్యాణ్ మాట ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మాటకు కట్టుబడి ఎలా పోరాటం చేశారో ప్రజలకు వివరించాలని టెలీకాన్ఫరెన్స్‌లో జనసేన పార్టీ నేతలకు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి...
అమరావతి పేరు వింటేనే జగన్ విషం కక్కుతున్నారు: సీఎం చంద్రబాబు
జగన్ ప్లాన్ బి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: కన్నా లక్ష్మీనారాయణ
Read Latest AP News And Telugu News