Share News

భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల యాత్రకు IRCTC అవకాశం

ABN , Publish Date - Apr 02 , 2026 | 03:02 PM

భక్తులకు IRCTC సువర్ణ అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా జ్యోతిర్లింగ యాత్రను ప్రారంభిస్తోంది. మరి ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏయే క్షేత్రాలను కవర్ చేస్తుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

భక్తులకు గుడ్ న్యూస్.. జ్యోతిర్లింగాల యాత్రకు IRCTC అవకాశం
IRCTC Jyotirlinga Yatra Train Package

ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భక్తులకు సువర్ణ అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా జ్యోతిర్లింగ యాత్రను అందిస్తోంది. ఈ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, మే 8న ముగుస్తుంది. 11 రాత్రులు – 12 రోజులు కొనసాగే ఈ ప్రయాణంలో మొత్తం 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించేలా అవకాశం కల్పించనుంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు గోరఖ్‌పూర్ నుంచి ప్రారంభమవుతుంది.


సందర్శించే ముఖ్య క్షేత్రాలు:

  • మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం (ఉజ్జయిని)

  • ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

  • ద్వారకాధీశ్, భేట్ ద్వారక

  • నాగేశ్వర్ జ్యోతిర్లింగం

  • సోమనాథ్ జ్యోతిర్లింగం (గుజరాత్)

  • త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం

  • భీమాశంకర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాలు

  • పంచవటి, కాలారామ్ ఆలయం వంటి ప్రముఖ స్థలాలు

Temple (24).jpg


రైలులో సౌకర్యాలు:

ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 751 బెర్త్‌లు ఉన్నాయి.

  • సెకండ్ ఏసీ

  • థర్డ్ ఏసీ

  • స్లీపర్ క్లాస్

ప్రయాణ ప్యాకేజీలు:

  • ఎకానమీ (స్లీపర్ క్లాస్) పెద్దలకు రూ.23,500 , పిల్లలకు రూ.22,160

  • స్టాండర్డ్ (3AC) పెద్దలకు రూ.40,000, పిల్లలకు రూ. 38,430

  • కంఫర్ట్ (2AC) పెద్దలకు రూ. 53,260, పిల్లలకు రూ. 51,370

ఈ ప్యాకేజీల్లో రైలు ప్రయాణం, హోటల్ వసతి, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, అలాగే స్థానిక దర్శనాల కోసం బస్సు సౌకర్యం ఉంటుంది.

బుకింగ్ వివరాలు:

IRCTC వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. EMI సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చుతో పలు పవిత్ర క్షేత్రాలను దర్శించాలనుకునే భక్తులకు ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మంచి అవకాశం.


Also Read:

దాంపత్య బంధం బలంగా ఉండాలంటే.. ఈ విషయాలు గుర్తించుకోండి..

30 ఏళ్ల వయసులో లవ్.. ఈ తప్పులు అస్సలు చేయకండి

For More Latest News

Updated Date - Apr 02 , 2026 | 03:13 PM