వేసవి తాపం నుంచి రక్షణ.. ఈ కూరగాయలతో మీ ఆరోగ్యం పదిలం!
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:27 PM
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భానుడి భగభగలు.. వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరం త్వరగా అలసిపోతుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం, నీరసం, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భానుడి భగభగలు.. వేసవి కాలం వచ్చిందంటే చాలు శరీరం త్వరగా అలసిపోతుంది. ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం, నీరసం, చర్మ సమస్యలు, జీర్ణక్రియ సంబంధిత ఇబ్బందులు వస్తుంటాయి. ఈ కాలంలో మన ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ఎంతైనా అవసరం. మనం తినే కూరగాయలు కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా.. శరీరాన్ని లోపల నుంచి చల్లబరిచేవిగా ఉండాలి.
1.సొరకాయ:
సారకాయలో దాదాపు 92శాతం నీరు ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎండ వల్ల కలిగే డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఇది ఉత్తమమైనది.
2.దోసకాయ:
దోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీనిని సలాడ్‌లాగా లేదా పప్పులో వేసుకుని తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది.
3.పొట్లకాయ:
పొట్లకాయ శరీరానికి చలువ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీబయాటిక్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో వచ్చే జ్వరం లేదా అలసటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
4.బీరకాయ:
బీరకాయలో సెల్యులోజ్, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా.. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
5.బెండకాయ:
బెండకాయలు శరీరానికి చలువ చేయడమే కాకుండా, వీటిలో ఉండే పీచు పదార్థం గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
6.టొమాటో:
టొమాటోలలో ఉండే ‘లైకోపీన్’ అనే పదార్థం ఎండ వల్ల చర్మం దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని, తేమను అందిస్తాయి.
7. తోటకూర, ఇతర ఆకుకూరలు:
ఆకుకూరల్లో విటమిన్ ఎ, సి, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి వేసవిలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించి, కళ్లకు మేలు చేస్తాయి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
గంటల తరబడి కూర్చొని పని చేస్తున్నారా? అయితే ఈ నష్టం తప్పదు
For More Health News