Share News

పేదల గుమ్మాల వద్దకే సంక్షేమ ఫలాలు

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:44 AM

పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల ఫలాలను వారి గుమ్మాల వద్దకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

పేదల గుమ్మాల వద్దకే సంక్షేమ ఫలాలు
Ponguleti Srinivas Reddy

  • అన్నివర్గాల వారికి చేయూత అందిస్తాం

  • మంత్రి పొంగులేటి

ఖమ్మం రూరల్‌/ తిరుమలాయపాలెం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం చేపడుతున్న పథకాల ఫలాలను వారి గుమ్మాల వద్దకు చేర్చడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో, అలాగే తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ దివాకరతో కలిసి నూతన చేయూత పింఛన్‌ మంజూరు పత్రాలను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్‌తో కలిపి 8లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు.


రూ.45వేల కోట్లతో పేదింటి ఆడబిడ్డల కోసం ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. ప్రజల మనసెరిగి వారికి ఉపయోగపడే పనులు చేయనప్పుడు ఏ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నా లాభం లేదని గత సర్కారు అలాంటిదేనని విమర్శించారు. ఒంటరి మహిళలు, వికలాంగులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, వృత్తులను నమ్ముకుని అవయవాలు కోల్పోయిన వారందరినీ నాటి ప్రభుత్వం విస్మరించిందన్నారు. అందుకే తమ సర్కారు దీపావళి నాడు 4.5 లక్షల మందికి ఒకేసారి పింఛన్లు అందిస్తామని చెప్పి మాట నిలబెట్టుకుందన్నారు.


పేదవాడి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాడు పదేళ్ల పాలకులకు లేకపోయిందన్నారు. రైతు రాజు కావాలనే ఉద్దేశంతో రూ.2 లక్షల రుణమాఫీ, ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా, సన్న వడ్లు వేసిన రైతన్నకు క్వింటాలుకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 72 వేల ఉద్యోగాలు ఇచ్చి.. మళ్లీ 14వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు పెట్టారని పొంగులేటి విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 05:44 AM