Share News

సీతమ్మసాగర్‌పై కేంద్రంతో చర్చలు: తుమ్మల

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:35 AM

సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

సీతమ్మసాగర్‌పై కేంద్రంతో చర్చలు: తుమ్మల
Thummala Nageswara Rao

అశ్వాపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను మంత్రి పరిశీలించారు.


అనంతరం విలేకరులతో తుమ్మల మాట్లాడారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టు పూర్తయితే ఆనకట్ట వద్ద 36 టీఎంసీల నీటి నిల్వ, 350 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాబాద్‌ జిల్లాలకు గోదావరి జలాలను సరఫరా చేసేందుకు వీలుంటుందన్నారు. సమ్మక్క బ్యారేజీ వద్ద అదనంగా 3-4 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆంధ్రజ్యోతి పేరుతో ఫేక్‌ వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన

సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 16 , 2026 | 04:35 AM